ఏపీ సీఎం జగన్ కు మరియు వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. దీనికి కారణాలు చాలానే ఉన్నా, రాజు అడిగిన పదవిని ఇవ్వకపోవడం వల్లనే అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అక్కసుతో ప్రతి రోజూ ప్రభుత్వాన్ని, పార్టీని, పార్టీలోని నాయకులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.