ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తగ్గుముఖం పట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలిచేలా కనిపించడం లేదు. త్వరలోనే థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కేసులు తగ్గుతున్నాయి కదా అని విచ్చలవిడిగా మళ్లీ రోడ్లపైకి వస్తే కరోనా మూడవ దశలో ప్రమాద స్థాయి పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.