వైసీపీ ప్రభుత్వం టార్గెట్గా ఎంపీ రఘురామకృష్ణంరాజు వరుసపెట్టి లేఖస్త్రాలు సంధిస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ నుంచే ఎంపీగా గెలిచి, చాలా కాలం నుంచి ఆ పార్టీకి ప్రతిపక్షంగా మాదిరిగా తయారైన రఘురామ, జగన్ ప్రభుత్వం టార్గెట్గా ఎలాంటి విమర్శలు చేస్తున్నారో తెలిసిందే. అలాగే రఘురామకి సైతం వైసీపీ ఏదొరకంగా చెక్ పెట్టాలని చూస్తోంది. కానీ రఘురామ ఎక్కడా తగ్గట్లేదు. ఏదొకరూపంలో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే చూస్తున్నారు.