ఏపీలో జగన్ ప్రభుత్వం తాజాగా వదిలిన జాబ్ క్యాలెండర్‌పై నిరుద్యోగులు నిరాశకు గురైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పిన ప్రభుత్వం...ఏడాది లోపు మరో 10 వేలు ఉద్యోగాలు ఇస్తామని క్యాలెండర్ విడుదల చేసింది. అయితే ఈ జాబ్ క్యాలెండర్‌పై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో దీనిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు, అనుబంధ విద్యార్ధి సంఘాలు రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి.