కరోనా సెకండ్ వేవ్ నుండి ఎలాగోలా బయటపడ్డాం అనుకునే లోపు, మూడవ దశలో చిన్నారుల పై కరోనా ముప్పు పొంచి ఉంది అనే అంచనాలు అధికంగా ఉన్న వేళ చిన్నారుల తల్లితండ్రులు భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటున్నారు. అందులోనూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తి వేయడంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.