రాజకీయాల్లోకి వచ్చేవారు.. ఏదోసాధించాలని, ఎంతో కొంత వెనుకేసుకోవాలని భావించడం సహజం. ఎన్నికల సమయానికి మళ్లీ ఓట్లు కొనుగోలు చేయాల్సిన ప్రస్తుత పరిస్థితిలో ఏ పార్టీ అయినా.. అధికారంలో ఉంటే.. ఆ పార్టీ నేతలు ఇలానే ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన ఓ నేత.. కూడా ఇలానే ఆలోచించారు. ఏదో ఒకటి చేయలేక పోతామా? అంటూ.. చాలానే ఖర్చు చేశారట.. గత ఎన్నికల్లో చేసిన ఖర్చుకు తగిన విధంగా ఆయన గెలిచారు. అయితే.. తర్వాతే.. ఆయన పరిస్థితి ఇరకాటంలో పడిందని అంటున్నారు.