ఏపీ మంత్రివర్గంలో బాగా దూకుడుగా ఉండే మంత్రి ఎవరంటే? ఠక్కున కొడాలి నాని పేరు చెప్పేయొచ్చు. జగన్ కేబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాని, టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కలు చూపించడంలో ముందుంటారు. నాని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబుపై విరుచుకుపడుతూనే ఉన్నారు. తనదైన శైలిలో నాని పరుష పదజాలం వాడుతూ బాబుపై ఫైర్ అవుతారు.