తెలంగాణాలో ఏదో సాధించాలని వచ్చినా షర్మిల ఇంకా రాజకీయంగా తన ఆలోచనలను మెరుగుపర్చుకోవాలని తెలుస్తోంది. రాజకీయం అంటే ప్రత్యర్థులపై ఈటెల్లాంటి మాటలు మాట్లాడుడు ఒక్కటే కాదు. ప్రత్యర్థుల బలాబలాలను అంచనావేసి అందుకు తగ్గట్టు వ్యూహాలను అమలుపరుస్తూ ఉండాలి. కానీ అది జరిగేలా అనిపించడం లేదు.