దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోని జగన్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలం ఇచ్చి అందులో ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 30 లక్షల ఇళ్లని రెండుదశల్లో ప్రభుత్వం కట్టించి ఇవ్వనుంది. జగనన్న కాలనీలు పేరిట ఈ ఇళ్ల నిర్మాణం జరగనుంది. జగనన్న కాలనీల్లో రూ.34వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే మొదటి దశలో ఇళ్ల నిర్మాణం కార్యక్రమం మొదలైంది.