దేశవ్యాప్తంగా కరోనా బీభత్సం కొనసాగుతూనే ఉంది. అయితే దాదాపు పది రోజుల నుండి కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా, రానున్న రోజుల్లో థర్డ్ వేవ్ కలకలం రేపబోతోంది అన్న వార్తలు ప్రజల్ని నిద్ర పోనివ్వడంలేదు. ఇలా ఎటు చూసినా కరోనా పేరు వినబడుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా అన్ని పనులు వాయిదా వేయక తప్పడం లేదు.