ఇటీవల కర్నూలు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హత్యకు గురైన నేతల కుటుంబాలని నారా లోకేష్ పరామర్శించి, అక్కడే మీడియా సమావేశం పెట్టి స్థానిక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యకు కారణం కాటసాని అని ఆరోపణలు చేశారు. అలాగే ఆవేశంగా సీఎం జగన్పై నోరు జారారు.