దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ గురించి పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఈ వేరియంట్ రానున్న రోజుల్లో కరోనా మూడవ దశ పేరుతో మరింతగా విజృంభించే అవకాశం ఉందని ఇప్పటికే వైద్య మరియు కోవిడ్ నిపుణులు చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి రాజేంద్ర షింగ్నే మాట్లాడుతూ రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ ప్రభావం అటు పేదలతో పాటుగా పిల్లలపై కూడా ఎక్కువ ప్రభావం చూపనుందని తెలిపారు.