ఏపీలో మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సమయం దగ్గర పడుతుండటంతో కేబినెట్లో ఉన్న మంత్రుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. నెక్స్ట్ కేబినెట్లో కొనసాగుతామా లేదా అనే విషయంపై పలువురు మంత్రులు బెంగ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మంత్రివర్గం ఏర్పాటు చేసిన మొదట్లోనే రెండున్నర ఏళ్లలో మంత్రివర్గంలో మార్పులు చేస్తానని, అప్పుడు పలువురుకు ఉద్వాసన తప్పదని జగన్ చెప్పేశారు.