గత రెండు సంవత్సరాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ఛాయలు ఇంకా మనల్ని వీడలేదు. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ రోజు రోజుకీ కరోనా థర్డ్ వేవ్ గురించిన వార్తలు ఎక్కువై మరింత భయాందోళనలను కలిగిస్తున్నాయి. అయితే కోవిడ్ నిపుణులు పలు ప్రకటనలు మరియు మీడియా సమావేశాల ద్వారా కరోనా పట్ల వ్యవహరించే విధానాల పట్ల అవగాహన కల్పిస్తున్నప్పటికీ లోలోపల చావు భయం మాత్రం అలాగే ఉంది.