జగన్ కేబినెట్లో ముగ్గురు మహిళలకు అవకాశం ఇచ్చారు. వీరిలో ఒకరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పుష్ప శ్రీవాణి కూడా ఉన్నారు. అయితే.. కొన్నాళ్లుగా ఆమె వ్యక్తిగత కారణాలతో విధులకు దూరంగా ఉన్నారు. దీంతో నియోజకవర్గంలో ఆమెపై తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. వాస్తవానికి ఆమె లేనప్పుడు ఆమె భర్త అన్నీ అయి కార్యక్రమాలు నడిపించారు. కానీ, కీలకమైన పనులు మాత్రం నిలిచిపోయాయని.. పెద్ద ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా.. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ.. తమకు ఏమీ మేలు జరగలేదన్న ఆరోపణలు రావడం.. వైద్య సదుపాయాలు లేక.. పలువురు మహిళలు మరణించడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.