గత ఎన్నికల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ మూడు స్థానాలు మాత్రమే గెలిచిన విషయం తెలిసిందే. 22 స్థానాల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఓడిపోయాక చాలామంది నేతలు పార్టీలో కనిపించకుండా వెళ్ళిపోయారు. పార్లమెంట్ స్థానాల్లో ఓడిన పలువురు నేతలు వైసీపీలోకి వెళ్ళగా, మరికొందరు ఎవరు పనులు వారు చూసుకుంటున్నారు.