ఏపీ రాజకీయాలు ఎక్కువగా బీసీలు చుట్టూనే తిరుగతాయనే సంగతి తెలిసిందే. ఎందుకంటే రాష్ట్రంలో బీసీ ఓటర్లే ఎక్కువ. అందుకే అగ్రకులాలకు చెందిన పార్టీ నేతలు, ఎన్నికల సమయంలో బీసీ మంత్రం జపిస్తారు. అంటే బీసీలు ఎటు మద్ధతు ఉంటే, ఆ పార్టీ సులువుగా గెలిచి అధికారం చేజిక్కించుకుంటుంది. గత ఎన్నికల్లో బీసీలు జగన్కు పెద్ద ఎత్తున మద్ధతు ఇచ్చారు. అందుకే వైసీపీ భారీగా సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది.