ప్రపంచ దేశాలలో వ్యాప్తి చెందిన కరోనా పురుగు మానవాళి జీవన శైలినే మార్చేసింది. ఓ వైపు లక్షల్లో జనాభా కరోనా కాటుకు బలయ్యారు. ఎంతో మంది తమ కుటుంబీకులను, బంధుమిత్రులను కోల్పోయి జీవచ్చవంలా బతుకుతున్నారు. ఇంకో వైపు ఎంతోమంది ఉద్యోగస్తులు తమ ఉపాధిని పోగొట్టుకొని రోడ్డున పడ్డారు.