ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయ రంగాన్ని కనుసైగతో శాసించిన రాజసం ఆయనది. ప్రజల మనసు గెలుచుకున్న ప్రజా నేతగా అప్పట్లో ఆయన చక్రం తిప్పారు. రాజకీయ చదరంగంలో కొమ్ములు తిరిగిన నాయకులు సైతం ఆయన చెప్పిందే చేస్తారు అనేంత పలుకుబడి ఉండేది. గతంలో ఈయన ముఖ్యమంత్రి కాబోతున్నారన్న వార్తలు కూడా వినిపించాయి.