ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటికి సంబంధించిన విషయంలో మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ కడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతుంది. ఆ ప్రాజెక్టుని అక్రమంగా కడుతున్నారని తెలంగాణ మంత్రులు, ఏపీలోని జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. విచిత్రం ఏంటి అంటే చనిపోయిన వైఎస్సార్‌ని సైతం రాజకీయాల్లోకి లాగి తెలంగాణ మంత్రులు తిడుతున్నారు.