తెలంగాణ రాష్ట్రము ప్రస్తుతం రెండు రకాల ఇష్యూలతో హాట్ టాపిక్ గా మారింది. మొదటిది హుజురాబాద్ ఉప ఎన్నిక కాగా, మరొకటి ఏపీ మరియు తెలంగాణకి మధ్య జరుగుతున్న జల వివాదం. ఈ రెండింటిలో జల వివాదం ఇప్పుడల్లా సమసిపోయే సమస్యలాగా కనిపించడం లేదు. దీనితో అందరి దృష్టి హుజురాబాద్ ఉప ఎన్నికపైనే నెలకొంది.