కృష్ణా జలాల విషయంలో ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పి తెలంగాణ మంత్రులు, జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే చనిపోయిన వైఎస్సార్‌ని కూడా ఈ వివాదంలోకి లాగి తిడుతున్నారు. అటు తెలంగాణ మంత్రులకు ఏపీ మంత్రులు కూడా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.