ప్రపంచంలో కోవిడ్ 19 పై రోజు రోజుకీ చర్చలు పెరిగిపోతున్నాయి. రానున్న కాలంలో ఈ వైరస్ నుండి మరిన్ని వేరియంట్లు వచ్చే ప్రమాదం పొంచి ఉన్నందున ఇప్పటి నుండే వాటి నుండి రక్షణ పొందడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందుకోసం భారతదేశంలోని ప్రజారోగ్య నిపుణులు, ఎపిడెమాలాజిస్టులు, కరోనా వైద్య నిపుణులు మరియు శాస్త్రవేత్తలు ఈ వేరియంట్ల నుండి రక్షించబడడానికి కరోనా వ్యాక్సిన్ బూస్టర్ షాట్స్ ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు.