ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే రాజకీయంగా తొలి దశ కావడం వలన రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయడంలో పొరపాట్లు చేస్తున్నట్లుగా అవగతమవుతోంది. వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.