ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని శాస్త్రవేత్తలు, కరోనా వైద్య నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న మాట తెలిసిందే. అయితే ఇప్పుడు అందరి ఆలోచనలు కరోనా మూడవ దశపై కేంద్రీకృతమై ఉండగా, కొందరు వైద్య నిపుణులు ఇక కరోనా పీరియడ్ ముగిసినట్లే అంటుండగా ఇంకొందరు థర్డ్ వేవ్ ఉందని ఈ దశలో ఎక్కువగా కరోనా పిల్లలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.