పవన్ కల్యాణ్....రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సెంటరాఫ్ ఎట్రాక్షన్. సినిమాల్లో సూపర్ క్రేజ్ ఉన్న పవన్‌కు, రాజకీయాల్లో కూడా అంతే క్రేజ్ ఉంది. ఆయన ఎక్కడకి వస్తే అక్కడకు జనం భారీగా వస్తారు. ఆయన ఏదైనా సమస్య గురించి మాట్లాడితే, ఆ విషయంపై అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఆలోచిస్తాయి. గతంలో పవన్ ఏదైనా సమస్య గురించి మాట్లాడితే, చంద్రబాబు ప్రభుత్వం వెంటనే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించేది.