మంత్రి పదవి...ఇదే ఇప్పుడు వైసీపీలో పలువురు ఎమ్మెల్యేల టార్గెట్. మరో నాలుగైదు నెలల్లో సీఎం జగన్ మంత్రివర్గంలో మార్పులు చేయనున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మొదట్లోనే రెండున్నర ఏళ్లలో మంత్రివర్గంలో మార్పులు చేస్తానని, దాదాపు 80 శాతంపైనే మంత్రులని పక్కనబెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇస్తానని చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేసింది. అంటే మరో నాలుగైదు నెలల్లో జగన్ కేబినెట్లో మార్పులు చేయడానికి సిద్ధమవ్వచ్చు.