సాధారణంగా ప్రతిపక్షం, అధికార పక్షంపై ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటుంది. ప్రభుత్వాలు మేలు చేసే కార్యక్రమాలు చేసిన కూడా ప్రతిపక్షం మాత్రం ఎప్పుడు అధికార పక్షాన్ని మెచ్చుకోదు. నిత్యం ఏదొక అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే ప్రతిపక్షం పని. ఇప్పుడు ఏపీలో ఉన్న ప్రతిపక్ష టీడీపీ కూడా అదే పని చేస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ విమర్శలు చేస్తూనే వస్తుంది.