శ్రీకాకుళం పార్లమెంట్...తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో ఇక్కడ పసుపు జెండాకు తిరుగులేదనే చెప్పొచ్చు. ఇక్కడ తెలుగుదేశం 7 సార్లు విజయం సాధించగా, కాంగ్రెస్ మూడుసార్లు గెలిచింది. గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ టీడీపీ తరుపున కింజరాపు రామ్మోహన్ నాయుడు గెలుస్తూ వస్తున్నారు.