ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నాయకుల పరిస్థితి ఏమిటో తెలిసిందే. పార్టీకి అధికారం లేకపోవడంతో కిక్కురుమనకుండా ఉన్నారు. ఇక సాధారణ కార్యకర్తల పరిస్థితి సరేసరి. వీరిని పట్టించుకునే నాధుడే లేడు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలతో చంద్రబాబు పోటీ చేసినా ప్రజలు తన పాలనపై విసిగిపోయి, దారుణంగా చరిత్రలో గుర్తుండిపోయే ఓటమిని ఇచ్చారు.