ఒక రాజకీయ నాయకుడిగా అధికార పార్టీలో ఉన్నా లేదా ప్రతి పక్ష పార్టీలో ఉన్నా వారి కర్తవ్యం ఒక్కటే. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేయడం. అధికారంలో ఉంటే ప్రజా ప్రయోజన పథకాలకు లేదా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉండాలి. ఒకవేళ ప్రతి పక్షంలో ఉన్నట్లయితే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అధికార పార్టీ విఫలమయితే లేదా చేయకుండా జాప్యం చేస్తుంటే వారిని ప్రశ్నించాలి ?