అంధప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాలు మధ్య జల జగడం తీవ్రంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే రాజకీయ ప్రయోజనాల కోసమే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కేసీఆర్, జగన్ ప్రభుత్వాలు వివాదాన్ని పెద్దది చేస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో త్వరలో జరిగే హుజూరాబాద్ ఉపఎన్నిక పోరుని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ జల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని, అక్కడి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.