జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు, ప్రతిరోజూ ప్రభుత్వంపై ఏదొకరకంగా విమర్శలు చేస్తు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయని రోజు అంటు లేదనే చెప్పొచ్చు. అయితే ఒక ఉద్యమంలా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ ముందుకెళుతున్న చంద్రబాబు, ఈ రెండేళ్లలో సాధించింది ఏంటి? జగన్ తిట్టడం వల్ల ప్రభుత్వంపై ఏమన్నా నెగిటివ్ తీసుకురాగలిగారా? అలా అని టీడీపీకి మైలేజ్ వచ్చేలా చేసుకున్నారా? అంటే అబ్బే అలాంటి కార్యక్రమం ఏమి జరగలేదని గట్టిగా చెప్పొచ్చు.