తెలంగాణ ఎంతోమంది అమరులను సాధించుకున్న బంగరు భూమి. నేడు కేసీఆర్ అధ్యక్షతన అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అధికార పార్టీ నాయకులు డప్పు కొడుతుంటే ? మరో వైపు విపక్షాలు అన్నీ మూకుమ్మడిగా కేసీఆర్ నాయకత్వాన్ని ఎండగడుతున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా, ప్రస్తుతం అందరి దృష్టి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో ఖాళీ అయిన హుజురాబాద్ నియోజకవర్గంలో అతి త్వరలోనే ఉప ఎన్నిక మీదనే నెలకొంది.