కాంగ్రెస్ నుంచి బయటకొచ్చాక వైసీపీ పెట్టిన జగన్పై జనాలకు భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా 2012 ఉపఎన్నికల్లో సత్తా చాటిన జగన్, 2014లో గెలిచి అధికారంలోకి వచ్చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని పరిణామాల మధ్య రాష్ట్రం విడిపోవడం, రాజధాని లేని ఏపీకి సీనియర్ నాయకుడు చంద్రబాబు సీఎం అయితేనే బాగుంటుందని చెప్పి ప్రజలు టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు.