రోజు రోజుకీ పెరుగుతున్న ఇంధన ధరల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింటుందని తెలుస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ మరియు డీజిల్ ల పై ట్యాక్స్ పంచుకుంటూ పోతున్నాయి. దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలా ఇంధన ధరలు అమాంతం పెరగడానికి ఎన్నో కారణాలను కేంద్రం చెబుతూ వస్తోంది.