ఏపీలో టీడీపీ ప్రస్తుత పరిస్థితి గురించి తెలియంది కాదు. అధికారాన్ని ఒక యువకుడికి కోల్పోవడంతో చంద్రబాబు ఊరొదిలిపెట్టి హైద్రాబాద్ లో కూర్చొన్నారు. అప్పుడప్పుడు తెలుగు తమ్ముళ్లను వీడియో కాల్ మీటింగ్ ల ద్వారా ఉత్తేజపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పార్టీని మళ్ళీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుందాం, అసలు మన ఓటమికి బీజం పడింది ఎక్కడ అన్న విషయాలను పునరాలోచించుకుని పరిస్థితులను చక్కదిద్దుకుందామనే ఆలోచనే వదిలేసినట్టు ఉన్నారు.