అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం...ఈ పేరు చెబితే మొదటి గుర్తొచ్చేది నందమూరి ఫ్యామిలీనే. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి హిందూపురంలో మరో పార్టీ ఇంతవరకు గెలవలేదు. వరుసగా ఇక్కడ టీడీపీదే విజయం కాగా, వరుసగా ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణలు హిందూపురంలో సత్తా చాటారు. గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ బాలకృష్ణ మంచి మెజారిటీలతో ఎమ్మెల్యేగా గెలిచారు.