ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై దేశ వ్యాప్తంగా అసంతృప్తి జ్వాలలు రగులుతున్న నేపథ్యంలో, ఈ అవకాశాన్ని జాతీయ కాంగ్రెస్ ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఒక ప్రణాళిక ప్రకారం అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ మధ్యనే ప్రముఖ రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తీర్ధాన్ని పుచ్చుకున్న విషయం తెలిసిందే.