కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో ఇంకా అర్ధం కావడంలేదు. తెలంగాణాకు కొత్త పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి వచ్చారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్‌కి మంచి రోజులు వస్తాయని అంతా ఆశిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్ష ముంగిట్లోనే ఉంది. అదే హుజూరాబాద్ ఉప ఎన్నిక. ఇక్కడ కనుక కాంగ్రెస్ సత్తా చాటితే రేవంత్ రెడ్డి నాయకత్వానికి కాంగ్రెస్‌లో ఎవరూ నోరెత్తే పరిస్థితి ఉండదు. కానీ నిజానికి అలా జరుగుతోందా అంటే లేదు అనే చెప్పాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఒకటి రెండు ఉదాహరణలు చూడాలిక్కడ.