తాను వైసీపీకి వీరవిధేయుడిని అని చెప్పుకుంటూనే బండెడు రాళ్ళు తెల్లారుతూనే వేస్తూంటారు రెబల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు. తనకు టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీ మీదనే ఆయన బాణాలు వేస్తారు. ఏకంగా అధినేత, ముఖ్యమంత్రి జగన్ మీద కూడా హాట్ కామెంట్స్ చేస్తారు. ఇదంతా ఎందుకు అంటే పార్టీ శ్రేయస్సు కోసమే అని కవరింగ్ ఇస్తారు. మరి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కెలికి సీబీఐ కోర్టులో కేసు వేసిన సందర్భంగా రఘురామ కవరింగ్ ఎలా ఉంది అంటే తమ నాయకుడు కడిగిన ముత్యం మాదిరిగా బయటకు రావాలనే ఇలా చేశాను తప్ప మరేమీ రాజకీయం లేదని.