ఎక్కడైనా రాజకీయాల్లో నాయకులు జంపింగులు చేయడం, అధికారం కోసం పార్టీలు మారడం కొత్త ఏమి కాదు. అయితే ఏపీలో ఈ జంపింగ్ రాజకీయాలు ఎప్పుడు జరిగే ప్రక్రియే. కాకపోతే జంపింగ్ చేసిన నాయకులని ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది మెయిన్ పాయింట్. మామూలు నాయకులని పక్కనబెడితే ప్రజాప్రతినిధుల్ని ప్రజలు పెద్దగా ఆదరిస్తున్నట్లు కనిపించడం లేదు. దానికి ఉదాహరణే 2019 ఎన్నికలు.