రాయలసీమలో అధికార వైసీపీకి తిరుగులేదనే సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో సీమలో ఉన్న నాలుగు జిల్లాల్లో వైసీపీ హవా నడిచింది. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటినా కూడా సీమ జిల్లాల్లో వైసీపీ స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నట్లు ఉంది. కాకపోతే ఒక్క అనంతపురంలో కాస్త వైసీపీకి వ్యతిరేక పవనాలు మొదలైనట్లు తెలుస్తోంది.