కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో మంత్రి కొడాలి నానికి తిరుగులేదనే చెప్పొచ్చు. భవిష్యత్లో గుడివాడలో నానికి చెక్ పెట్టడం ప్రత్యర్ధుల వల్ల కాదు. కాకపోతే ఇక్కడ కొడాలికి కాస్త ఇబ్బందికర పరిస్తితులు వచ్చేది పవన్ కల్యాణ్ పార్టీ జనసేన వల్లే అని చెప్పొచ్చు. అలా అని ఇక్కడ జనసేనకు గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవు. జనసేనకు డిపాజిట్లు రావడం కూడా కష్టమే.