మొదట నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా కూడా ఒకటి... ఈ జిల్లాలో ఎప్పుడు టీడీపీకి అనుకూల ఫలితాలే వచ్చేవి...కానీ గత ఎన్నికల్లో మాత్రం ఈ జిల్లాలో వైసీపీ సత్తా చాటింది. వైసీపీ సత్తా చాటినా సరే టీడీపీ కాస్త బలంగానే కనిపిస్తోంది. ఆ పార్టీ తరుపున స్ట్రాంగ్ నాయకులు ఉన్నారు కాబట్టి, మళ్ళీ పార్టీ త్వరగానే పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో మాత్రమే టీడీపీని నడిపించే నాయకుడు ఎవరో క్లారిటీ రావడం లేదు.