అధికార పార్టీల్లో సాధారణంగానే నేతల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది. ఎక్కడకక్కడే మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య...ఎంపీలు, ఎమ్మెల్యేలు మధ్య...ఎంపీలు, మంత్రుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. అలాగే కొత్తగా పార్టీలో వచ్చిన నాయకులు, పాత నాయకుల మధ్య రగడ ఉంటుంది. అయితే ఈ ఆధిపత్య పోరుకు అధికార పార్టీలు చెక్ పెట్టుకోవాలి. లేదంటే రేపటి రోజున ఆ పోరే పార్టీ కొంపముంచుతుంది.