తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా సత్తా చాటే మంత్రి హరీష్ రావు, హుజూరాబాద్‌లో మకాం వేసేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టడానికి తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ని గెలిపించే బాధ్యత హరీష్...తన భుజాలపై వేసుకున్నారు. ఇప్పటికే హుజూరాబాద్‌లో పోటీ చేసే గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి...నియోజకవర్గాన్ని రౌండప్ చేసేస్తున్నారు.