ఏపీలో అధికార వైసీపీలోనే కాదు..ప్రతిపక్ష టీడీపీలో సైతం ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా విజయవాడలో టీడీపీ నేతల మధ్య అసలు సమన్వయం లేదు. ఇక్కడ నేతలు ఒకరి వెనుక ఒకరు గోతులు తీసుకునే పనిలో ఉన్నారు. అలా గోతులు తీసుకునే గెలవాల్సిన విజయవాడ కార్పొరేషన్లో టీడీపీ ఓడిపోయింది. ఇక్కడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్లు ఒక వర్గంగా ఉంటే, బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు మరో వర్గంగా ఉన్నారు.