పిల్లి సుభాష్ చంద్రబోస్...ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్లో పనిచేసిన సుభాష్...ఇప్పుడు వైసీపీలో కీలకంగా ఉన్నారు. కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పిల్లి...1989లో కాంగ్రెస్ తరుపున రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమి పాలైన ఆయన 2004, 2009 ఎన్నికల్లో రెండుసార్లు వరుసగా విజయం సాధించారు. ఇక వైఎస్సార్ చనిపోవడంతో కాంగ్రెస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ జగన్ వెంట నడిచారు. ఈ క్రమంలోనే 2012 ఉపఎన్నికలో వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు.