తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడటం లేదు. పార్టీని గాడిలో పెట్టడానికి బాబు, ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్నారు. పార్టీకి పెద్దగా ఉపయోగం లేని నేతలని పక్కనబెడుతున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయాక చాలామంది నేతలు అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. అలాగే కొందరు వైసీపీలోకి జంప్ కొట్టేశారు. దీంతో ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు చంద్రబాబు ఇన్చార్జ్లని పెట్టుకుంటూ వస్తున్నారు.